భారతదేశంలో 2001లో ప్రారంభమైన ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ (టి కే డిఎల్) ప్రాజెక్ట్‌ను, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండిస్టియల్ రీసెర్చ్ డ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఆయుష్ విభాగం (ఆయుర్వేద, యోగా, నేచురోపతి, యునానీ, సిద్ధ, హౌమియోపతి) సంయుక్తంగా అభివద్ధి చేశాయి.
భారతీయ సాంప్రదాయ వైద్య జ్ఞానాన్ని రక్షించడం, అంతర్జాతీయ పేటెంట్ కార్యాలయాల్లో బయోపైరసీ నిరోధించడం టీకేడీఎల్ ప్రధాన లక్ష్యం, ఆదివాసీ, స్థానిక సముదాయాలు ఆశ్రయించే సాంప్రదాయ జ్ఞానం భారతదేశంలోని 70% ఆరోగ్య అవసరాలకు కీలకంగా ఉంది, గ్లోబల్‌గా పెరుగుతున్న సాంప్రదాయ వైద్యంపై ఆసక్తిలో భారతదేశం ముందంజలో ఉంది. డిజిటల్ కన్సల్టేషన్ ప్లాట్‌ఫారమ్‌లు స్థాపన, ఆయుష్ వైద్యుల కోసం డిజిటల్ నైపుణ్యాల అభివద్ధి, ఇంటరాపరబుల్ ఆరోగ్య వ్యవస్థల రూపకల్పన భారత లేదా ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలకు చెందిన ప్రముఖ అంశాలు అయ్యాయి.
భారత సాంప్రదాయ వైద్య జ్ఞానం సంస్కతం, హిందీ, అరబిక్, ఉర్దూ, తమిళం వంటి భాషలలో ఉండటంతో పాటు, ప్రాచీనమైన స్థానిక ఉపభాషలలో ఉండటం వల్ల అంతర్జాతీయ పేటెంట్ పరిశీలకులకు అవి సులభంగా అర్థంకావడంలేదు. ఈ భాషా, ఫార్మాట్ అవరోధాలను అధిగమించేందుకు టీకేడీఎల్, ఆయుర్వేదం, సిద్ధ, యునానీ, యోగ, హోమియోపతి వంటి భారతీయ సాంప్రదాయ వైద్య గ్రంథాలను ఐదు అంతర్జాతీయ భాషలలో… ఇంగ్లీష్, జపనీస్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్ కి అనువదించి, సాంకేతికంగా శాస్త్రీయంగా మౌలికీకరించి డేటాబేస్‌గా రూపొందించింది. ఇప్పటి వరకు 4.54 లక్షలకుపైగా ఫార్ములేషన్లు, ప్రాక్టీసులు టీకేడీఎల్‌లో నమోదు చేయబడ్డాయి. టీకేఆర్‌సీ (ట్రెడిషనల్ నాలెడ్జ్ రిసోర్సెస్ క్లాసిఫికేషన్ ) అనే వర్గీకరణ వ్యవస్థ ద్వారా ఆయుర్వేదం, సిద్ధ, యునానీ, యోగా వంటి వైద్య విధానాలను వేల ఉపవర్గాలుగా విభజించి, అంతర్జాతీయ పేటెంట్ క్లాసిఫికేషన్‌లో 200కు పైగా ఉపవర్గాలను చేర్చేలా చేసింది. ఇది ట్రెడిషనల్ నాలెడ్జ్ సంబంధిత పేటెంట్ దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించారు.
టీకేడీఎల్ టెక్నాలజీ వివిధ భాషలు (సంస్కతం, అరబిక్, ఉర్దూ, పర్షియన్, తమిళం మొదలైనవి) శాస్త్రాలను (ఆయుర్వేదం, యునానీ, సిద్ధ, యోగా, ఆధునిక విజ్ఞానం, ఆధునిక వైద్యం) సమన్వయపరుస్తూ పనిచేస్తోంది. ప్రస్తుతం టీకేడీఎల్‌లోని సమాచారం, ఓపెన్ డొమైన్/ పబ్లిక్ డొమైన్‌లో లభించే భారతీయ వైద్య గ్రంథాల ఆధారంగా రూపొందించబడింది, వీటిని దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎవరైనా ఉపయోగించుకోవచ్చు.
టీకేడీఎల్ డేటాబేస్‌ను 16 అంతర్జాతీయ పేటెంట్ కార్యాలయాలు ఉపయోగించుకుంటున్నాయి. వీటిలో యూరోపియన్ పేటెంట్ ఆఫీస్, యుఎస్ పేటెంట్ అండ్ ట్రేడ్మార్క్ ఆఫీస్, జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా, చిలీ, మలేషియా, రష్యా, పెరూ, స్పెయిన్, డెన్మార్క్, ఫ్రాన్స్, యూరేషియన్ పేటెంట్ ఆఫీస్‌లు ఉన్నాయి. ఇక టీకేడీఎల్ ఆధారంగా పలు అంతర్జాతీయ పేటెంట్ కార్యాలయాలలో ప్రీ-గ్రాంట్ వ్యతిరేకతలు దాఖలవుతున్నాయి. ఇప్పటివరకు 324కి పైగా పేటెంట్ దరఖాస్తులు, టీకేడీఎల్ ఆధారంగా రద్దు చేయబడ్డాయి, సవరించబడ్డాయి. భారతదేశం టీకేడీఎల్, బయోపైరసీని అడ్డుకునే శక్తివంతమైన సాధనంగా నిలిపబడి, సాంప్రదాయ జ్ఞానాన్ని ఉపయోగించడాన్ని, దుర్వినియోగం కాకుండా జాగ్రత్తగా రక్షించే మార్గాన్ని టీకేడీఎల్ శక్తివంతంగా పనిచేస్తున్నది.
భారతదేశం సంప్రదాయ జ్ఞానాన్ని డిజిటల్ లైబ్రరీగా ప్రారంభించిన తొలి దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. 2025 జూలై 12న విడుదలైన ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా సాంకేతిక నివేదికలో ‘మ్యాపింగ్ అప్లికేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఇన్ ట్రెడిషనల్ మెడిసిన్’ అనే పేరుతో సంప్రదాయ వైద్యానికి కత్రిమ మేధస్సును (ఎఐ) సమన్వయంతో అనుసంధానించడంలో భారతదేశ మేధావులు ఆధునిక అధ్యయనాలను చేస్తున్నారు. ఆయుష్ రంగం ఆర్థిక అభివద్ధికి ప్రేరణగా భారతదేశం 43.4 బిలియన్ డాలర్ల మార్కెట్ కలిగి ఉన్నది. దీని ద్వారా జబ్బుల ముందు సూచికల గుర్తింపు, వ్యక్తిగత ఆరోగ్య సూచనలు వంటి సేవలు ఎఐ ఆధారంగా అందించవచ్చు. అలాగే, హెర్బల్ ఫార్ములేషన్‌ల మాలిక్యూలర్ బేస్‌ను పునరోపయోగం కోసం డీకోడ్ చేయడం ద్వారా సంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక విజ్ఞానంతో కలిపే ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ తాలూకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో భారతదేశం సాంప్రదాయ వైద్యానికి మార్గ సూచిక నిలిచింది. వాటిలో ఆయుష్ పద్ధతుల్లో భారతదేశ ఆవిష్కరణలు, ఆయుర్జెనోమిక్స్ (జినోమిక్స్ ఆయుర్వేద), సంప్రదాయ జ్ఞానాన్ని డిజిటల్ చేయడం, పేషెంట్ డయాగ్నోసిస్, డ్రగ్ డిస్కవరీలో కత్రిమ మేధస్సు ప్రయోగాలు, సంప్రదాయ ఫార్ములేషన్‌లను ఆధునికీకరించడం వంటి అంశాలకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ నివేదికలో ఆయుర్వేదం, సిద్ధ, యునాని, సోవా రిగ్‌ప, హోమియోపతి వంటి పద్ధతుల్లో ఎఐ ఆధారిత ఉపయోగాలను వివరించడమే కాకుండా, నాడి పరీక్ష, నాలిక పరిశీలన, ప్రకతి విశ్లేషణ వంటి సంప్రదాయ పద్ధతులను మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్‌లు, డీప్ న్యూరల్ నెట్‌వర్క్‌లతో కలిపిన డయాగ్నోసిస్ సపోర్ట్ సిస్టమ్‌లను ప్రస్తావించింది.
భారతదేశం రూపొందించిన టీకేడీఎల్ ఆరోగ్య రంగంలో ప్రధానంగా ఆయుష్ శాఖ ద్వారా ఎఐ ఆధారిత డిజిటల్ ప్లాట్‌ఫాం, పురాతన వైద్య గ్రంథాలను, అపురూపమైన వైద్య గ్రంథాలను డిజిటల్‌గా నిక్షిప్తం చేసేందుకు విస్తతంగా వినియోగిస్తున్నారు. ఎఐ ద్వారా పూర్వీకుల జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, పుస్తక సంపదను, చేతి రాతప్రతులను రక్షించడమే కాదు, ఆధునిక శాస్త్రీయ పరిశోధనలకు, కొత్త మందుల అభివద్ధికి, ఇతర దేశాలతో అనుసంధానానికి దోహదపడతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం భారత్ ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని సాంప్రదాయ వైద్యశాస్త్రాన్ని ఆధునిక పద్ధతులతో మిళితం చేసి ఆ ప్రజలకు అందుబాటులో ఉంచుతూ అదేవిధంగా వైద్య సేవలు అందించేందుకు ప్రయత్నం చేస్తున్నది
సాంప్రదాయ జ్ఞాన డిజిటల్ లైబ్రరీ (టి కేడిఎల్) ఆధ్వర్యంలో ప్రాచీన గ్రంథాల డిజిటల్ కేటలాగింగ్, సీమాంటిక్ విశ్లేషణ కోసం ఎఐ సాధనాలు వినియోగించారు. భారతదేశం ఆధ్వర్యంలోని ఎఐ ప్రేరిత అభివద్ధులు ప్రకతి ఆధారిత మెషిన్ లెర్నింగ్ మోడల్స్, ఆయుర్జెనోమిక్స్ ప్రాజెక్ట్, ఆయుష్ గ్రిడ్ వంటి డిజిటల్ హెల్త్ ఆయుష్ రీసెర్చ్ పోర్టల్ లాంటి వినూత్న సంస్థాపనలు, సాంప్రదాయ వైద్యాన్ని సామాజిక, ఆధారిత డిజిటల్ ఆరోగ్యంగా మలుస్తున్నాయి. ప్రకతి అసెస్‌మెంట్ వంటి పద్ధతులకు మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్‌ను జోడించారు. సాంప్రదాయ విజ్ఞానం డిజిటల్ గ్రంథాలయం ద్వారా ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ ద్వారా వేలాది ఔషధ వక్షాల సమాచారాన్ని ప్రపంచానికి అందుబాటులోకి తెచ్చింది. ఎఐ ద్వారా పురాతన గ్రంథాల అనువాదం, సెమాంటిక్ విశ్లేషణ, థెరపీ నైపుణ్యం పెరిగింది. ఎఐ ఆధారిత డ్రగ్ యాక్షన్ మార్గాలు, ఆయుర్వేద- టిసియం (చైనా మెడిసిన్), – యునానీ అంతర్గత పరిశీలన, డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్ ద్వారా ఆన్‌లైన్ కన్సల్టేషన్‌లు, ఆయుష్ వైద్యులకు డిజిటల్ లిటరసీ ప్రోత్సాహనం, హెల్త్‌కేర్ సిస్టమ్‌లో ఆయుష్ సమన్వయం, దేశీయంగా మాత్రమే కాక, అంతర్జాతీయంగా సాంప్రదాయ వైద్యాన్ని ప్రమాణాత్మకంగా, సురక్షితంగా పురోగమింప చేయడంలో భారత్ ప్రాధాన్యత ఉన్న దేశం భవిష్యత్తులో ప్రపంచ ఆరోగ్య సంరక్షణలో భారతదేశం పాత్ర మరింత ప్రభావవంతంగా ఉండబోతుంది.
భారతదేశం ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ ద్వారా సాంప్రదాయ వైద్యాన్ని, కత్రిమ మేధస్సుతో ఆధునికీకరించి, ప్రపంచ ఆరోగ్య రంగానికి మార్గనిర్దేశక దేశంగా ఎదిగింది.
– డా|| రవికుమార్ చేగొని, 9866928327
ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ
- Advertisement -
- Advertisement -