– రాకపోకలకు ఇబ్బందులు
నవతెలంగాణ మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు కరువయ్యాయి మద్నూర్ మండల కేంద్రంలో ప్రతి సోమవారం సంత జరుగుతుంది. సంత రోజు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వ్యాపారులు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈ పాత బస్టాండ్ నుండే ప్రయాణికులు దూరప్రాంతాలకు వెళ్లడానికి బస్సుల కోసం వేచి చూస్తారు. పాత బస్టాండ్ సమీపంలోనే ఎస్బిఐ బ్యాంకు ఉండడం బ్యాంకు లావాదేవీలకు కూడా వందల సంఖ్యలు జనాలు రావడం కిక్కిరిసిన జనాలకు పాత బస్టాండ్ లో వాహనదారులకు ఇబ్బందిగా మారింది.
కిక్కిరిసిన జనాలకు పాత బస్టాండులో ట్రాఫిక్ నియంత్రణతో ఇబ్బంది పడవలసి వస్తుంది. రోడ్డు దాటాలన్న వాహనాలతో ఇబ్బందిగా మారింది. సొంత రోజు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడితే జనాలకు గానీ వాహనదారులకు గాని ఇబ్బందులు దూరం అవుతాయని వాదనలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.



