నవతెలంగాణ – ఆలేరు రూరల్ : మోంథా తుఫాన్ ప్రభావంతో ఇటీవల ఆలేరు నియోజకవర్గం కురిసిన వర్షాలకు బిక్కేరు వాగు పెద్ద ఎత్తున పొంగి ప్రవహిస్తుంది. శనివారం నాడు నీటి ఉధృతి వల్ల తూర్పు గూడెం మాటూరు గ్రామాల మధ్యన లో బిక్కేరు వాగు పై లో లెవెల్ వంతెన మీదుగా మోకాళ్ళ లోతుకు పైగా వరద నీరు వేగంగా పరుగులు తీస్తుంది రెండు గ్రామల మధ్యన రాకపోకలకు అంతరాయం కలిగింది. టూవీలర్ ఆటోలు సైలెన్సర్ నీటిలో మునుగుతుందని ధైర్యం చేసి కాలినడకన మాత్రమే వాగు ఇరువైపులా పాడి రైతులు, గీత కార్మికులు తప్పనిసరి పరిస్థితుల్లో కాలినడకనా బిక్కెర వాగు దాటే ప్రయత్నం చేస్తున్నారు.ఈ వర్షాకాలంలో ప్రతినెల పది పదిహేను రోజుల పాటు ఇదే పరిస్థితి నెలకొంది. రెండు గ్రామాల మధ్యన శాశ్వత పరిష్కారం కై హై లెవెల్ వంతెనను నిర్మించాలని ప్రజలు ప్రజా ప్రతినిధులను అధికారులను కోరుతున్నారు.
బిక్కేరు ప్రవాహంతో స్తంభించిన రాకపోకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



