Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలునల్లమలలో 12 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..

నల్లమలలో 12 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్: వీకెండ్ కారణంగా వరుస సెలవులు రావడం.. దానికి తోడు శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు, సందర్శకుల తాకిడి ఎక్కువైంది. దీంతో హైదరాబాద్, శ్రీశైలం రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలు చీమల బారులు తీరినట్లుగా రోడ్డుపై నిలిచిపోయాయి. ఈ రోజు శ్రీశైలం వెళ్లే దారిలో దోమలపెంట నుంచి సున్నిపెంట వరకు 12 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 3 గంటలకు పైగా వాహనాలన్నీ రోడ్లపై నిలిచిపోయాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నల్లమల అడవి మార్గంలో రోడ్లపై కిలోమీటర్ల మేర వేల వాహనాలు నిలిచిపోవడంతో పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో గేట్లను ఎత్తడంతో డ్యాం సందర్శకులకు ఆకర్శనీయంగా కనువిందు చేస్తోంది. నల్లమల ప్రకృతి అందాలు, డ్యాంను చూడటంతో పాటు శ్రీశైల ఆలయ దర్శనం కోసం భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వేల వాహనాలు రోడ్లపైన బారులు తీరాయి. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు మరింత సమయం పట్టనుందని పోలీసులు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad