Friday, September 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గుంతలను పూడ్చి వేయించిన ట్రాఫిక్ పోలీసులు 

గుంతలను పూడ్చి వేయించిన ట్రాఫిక్ పోలీసులు 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. అలాగే చాలా ప్రాంతంలో నాలాలు పొంగిపొర్లాయి. పూలాంగ్ వాగు సైతం ఉధృతంగా ప్రవహిస్తోంది.

నగరంలోని ప్రధాన రోడ్లల్లో భారీగుంతలను వాహనదారులను భయపెడుతున్నాయి. ముఖ్యంగా వర్షం కురిసినప్పుడు ఈ గుంతలు నీళ్లతో నిండిపోయి ఏర్పడకపోవడంతో పలువురు వాహనదారులు వీటిలో పడి గాయాలపాలైన సంఘటనలున్నాయి.నగరంలోని ప్రగతి హాస్పిటల్ నుంచి ప్రగతినగర్ మున్నూరుకాపు సంఘం వైపు వెళ్లే చౌరస్తాలో భారీ గుంత కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.దీంతో స్పందించిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ తన సిబ్బందితో గుంతను పూడ్చివేయించారు. జేసీబీ సాయంతో గుంతను కప్పివేయించారు. దీంతో వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -