Monday, October 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోడ్ తవ్వి వదిలేసిన మట్టిని తొలగించిన ట్రాఫిక్ పోలీసులు

రోడ్ తవ్వి వదిలేసిన మట్టిని తొలగించిన ట్రాఫిక్ పోలీసులు

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నగరంలోని రైల్వే ఫ్లైఓవర్ వద్ద కేబుల్ వేయడానికి గుంత తవ్వి రోడ్ పైన మట్టిని వదిలివేశారు. ఈ మట్టి రోడ్డుపైన ఉండడం వలన ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో విషయం తెలిసిన వెంటనే ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ కేశవులు, కిరణ్, రాజసాగర్, గోపాల్ దినేష్ లు స్వయంగా పారలతో మట్టిని మంగళవారం తొలగించారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చేశారు. ట్రాఫిక్ పోలిస్ వారు చేసిన మంచి పనికి నగర ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -