- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లో ఆగస్టు 24న రన్నర్స్ మారథాన్ సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియం వరకు ఆంక్షలు ఉంటాయని.. ఆదివారం ఉదయం 4.30 నుంచి 9 గంటల వరకు అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. ఖైరతాబాద్, పంజాగుట్ట, కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ మీదుగా మారథాన్ సాగనుంది. కాబట్టి వాహనదారులు వేరే రూట్‌లో వెళ్లాలని పోలీసులు సూచించారు.
- Advertisement -