Monday, January 19, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: సీఐ రవీందర్ నాయక్

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: సీఐ రవీందర్ నాయక్

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్
ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ముధోల్ సిఐ రవీందర్ నాయక్ అన్నారు. ముధోల్  మండలంలోని తరోడ గ్రామంలో డిఫెన్స్ డ్రైవింగ్ పై సోమవారం సాయంత్రం ముధోల్ పోలిసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. వాహనాదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేయించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ బిట్ల పెర్సిస్,  సర్పంచ్ ఆరిపోద్దిన్, నాయకులు రవికిరణ్ గౌడ్, గ్రామస్తులు , తదితరులు, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -