Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్జుక్కల్ - కర్ణాటకకు రాకపోకలు బంద్..

జుక్కల్ – కర్ణాటకకు రాకపోకలు బంద్..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని జుక్కల్ నుండి  దేగ్లూర్ వెళ్లే ప్రయాణికులకు, సోపూర్ – కర్ణాటకకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గురువారం ఉదయం నుండి మండలంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో మద్నూర్ మండలం సోమూర్ బ్రిడ్జి వద్ద అంతాపూర్ , పెద్ద  తడ్గూర్ , జుక్కల్ మండలంలోని హంగర్గా – మాదాపూర్ బ్రిడ్జీ పై నుండి నీరు భారీగా  ప్రవహిస్తుండడంతో అటు వైపు రాకపోకలు నిలిచిపోయాయి. ఉదయం నుండి బస్సులు రాకపోకలు నిలిపివేశారు. అదేవిధంగా మండలంలోని పలు గ్రామాలలో జనజీవనం స్తంభించిపోయింది. ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో గ్రామాలలోని ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. మండలంలోని గ్రామాలలో పంట పొలాలలో భారీగా వర్ధనీరు వచ్చి చేరడంతో వందల ఎకరాల సోయా, పెసర, మినుము, పత్తి, కంది, కూరగాయల పంటలకు భారీగా నష్టం జరిగిందని రైతులు ఆందోళనలో ఉన్నారు. 

జుక్కల్ మండలంలోని కర్ణాటక సరిహద్దు గ్రామమైన సోపూర్  బ్రిడ్జి వద్ద పై నుండి మహారాష్ట్ర , కర్ణాటక వెళ్లడానికి ఇదొక్కటే మార్గం కలదు. అటు మహారాష్ట్ర ఇటు కర్ణాటక వెళ్ల డానికి సరిహద్దు గ్రామం వద్ద కౌలస్ నాళా ప్రాజెక్టు ఎగువన నిర్మించిన సరిహద్దు బ్రిడ్జి ఒకటే మార్గం ఉంది. సొపూర్ బ్రిడ్జీ ఎగువ  పై నుండి భారీగా నీరు ప్రవహిస్తూ ఉండడంతో అటువైపు వెళ్లకుండా గ్రామస్తులతో కలిసి పంచాయతీ కార్యదర్శి అశోక్ రాథోడ్ అక్కడే బస చేసి ఎవరికి బ్రిడ్జి పై నుండి వెళ్ళనీయకుండా కాపలాగా ఉన్నారు. బుధవారం రాత్రి నుండి గ్రామంలో చాటింపు వేసి ప్రజలను అప్రమత్తం చేశామని పంచాయతీ కార్యదర్శి అశోక్ రాథోడ్ తెలిపారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad