పొంగి పొర్లుతున్న అంతాపూర్ సోమూరు వాగు
నవతెలంగాణ మద్నూర్
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి మద్నూర్ మండలంలోని అంతాపూర్ సోమూరు గ్రామాల మధ్యగల వాగు పొంగిపొర్లుతుండడంతో మద్నూర్, జుక్కల్, మండలాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ రహదారి ఇరు మండలాలకు అతి ముఖ్యమైన రహదారి అంతాపూర్ సోమూరు మధ్యగల వాగు పైన ఓవర్ బ్రిడ్జి లేకపోవడం ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వాగు పొంగినప్పుడల్లా రాకపోకలు నిలిచిపోతాయి. ఈమధ్య కాలంలోనే ఈ వాగు పొంగిపొరడంతో రెండు రోజులు రాకపోకలు పూర్తిగా నిలిచిపోగా మళ్లీ గురువారం నుండి వాగు పొంగిపొర్లుతుండడం రాకపోకలు నిలిచిపోయి అంతరాయం ఏర్పడింది.
అంతాపూర్ గ్రామస్తుడు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు మారుతి వాగు దగ్గర వరద నీటిని పరిశీలిస్తూ వాగు, పొరలి పొంగుతుండడం పట్ల ఈ రహదారి గుండా వాన దారులు ముందు జాగ్రత్తగా రాకుండా ఉండాలని ఎక్కడికైనా వెళ్లాలంటే ఇతర మార్గాల గుండా వెళ్లాలని ఆయన కోరారు భారీ వర్షాల మూలంగా మద్నూర్ మండలంలోని పలు గ్రామాలకు వాగులు వంకలు నిండుగా పారడం రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది.