Thursday, February 5, 2026
E-PAPER
Homeకరీంనగర్అక్రమ నగదు, మద్యం రవాణాను సమర్థవంతంగా అరికట్టాలి

అక్రమ నగదు, మద్యం రవాణాను సమర్థవంతంగా అరికట్టాలి

- Advertisement -

చెక్ పోస్ట్ ల వద్ద  అధికారులు,సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
వెంకటాపుర్ చెక్ పోస్ట్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే.
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో వెంకటాపుర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను పట్టణ ఇన్స్పెక్టర్ తో కలసి జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే గురువారం తనిఖీ చేసి వాహన తనిఖీల రిజిస్టర్లు పరిశీలించారు. చెస్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి వివరాలను నమోదు చేయాలన్నారు. పోలింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉంటూ ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా జరిగే నగదు,మద్యం వంటి అక్రమ రవాణాను అరికట్టాలని సూచించారు.

మున్సిపల్ కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుండి ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై 06 కేసులు నమోదు చేయడం జరిగిందని,తనిఖీల్లో 26,70,000/- రూపాయల నగదు సీజ్ చేయడం జరిగిందని,10 కేసులలో 85.695 లీటర్ల మద్యం సీజ్ చేయడం జరిగిందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రక్రియ మొత్తం సజావుగా జరిగేలా 80 కేసులలో 127 మందిని బైండోవర్ చేయడం జరిగిందన్నారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేలా పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ  వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ, ఎస్.ఐ శ్రీకాంత్,సిబ్బంది ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -