చెరువులో ఆటో బోల్తా పడి తండ్రీకొడుకు మృతి
నవతెలంగాణ-దుండిగల్
గణేష్ నిమజ్జనంలో విషాదం జరిగింది. నిమజ్జనానికి వెళ్లిన తండ్రీకొడుకు ఆటో సహా చెరువులో పడి ప్రాణం కోల్పోయారు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజగిరి జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగలూరు చెరువు వద్ద జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దుండిగల్‌లోని వెస్లీ కాలనీవాసులు ఆదివారం రాత్రి ఆటోలో గణేష్ విగ్రహాన్ని నాగలూరు చెరువు వద్దకు తీసుకెళ్లారు. వారితో కలిసి శ్రీనివాస్(31) తన కొడుకు వెస్లీ(7)ని తీసుకుని వెళ్లాడు. నిమజ్జనం అనంతరం మిగతావారు నడుచుకుంటూ తిరిగి వచ్చారు. శ్రీనివాస్, వెస్లీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. దాంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చెరువు వద్ద పరిశీలించారు. చెరువులో రాయిపై ఆటో గుర్తులు కనిపించడంతో డీఆర్‌ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు ప్రారంభించింది. సోమవారం ఉదయం తండ్రి, కొడుకు మృతదేహాలు, ఆటోను బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చెరువులో ఆటో బోల్తా పడి ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కుత్బుల్లాపూర్ కో-కన్వీనర్ సతీష్ మాట్లాడుతూ.. చెరువు వద్ద స్ట్రీట్ లైట్లు, భద్రతా గేట్లు వంటి కనీస సదుపాయాలు లేకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందిన తెలిపారు. అధికారుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని, మృతుల కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
గణేష్ నిమజ్జనంలో విషాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES