నీటి ప్రవాహంలో వ్యక్తి గల్లంతు
నవతెలంగాణ-నాగార్జునసాగర్
పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. సాగర్ సందర్శనకు వచ్చిన కుటుంబం తొందరపాటు కారణంగా కృష్ణా ప్రవాహంలో దిగి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. సాగర్ ఎస్‌ఐ ముత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని చింతల్‌కు చెందిన దిరిసెల రాంబాబు (45) మైలాన్ ఫార్మా కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం తన భార్య సుహాసిని, తన ఇద్దరు కొడుకులతో నాగార్జునసాగర్ సందర్శనకు వచ్చారు. సాగర్ డ్యామ్ దిగువ భాగానికి గేట్ల ద్వారా నీటి విడుదల దృశ్యాలను చూసి సంతోషంగా గడిపారు. ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, పాత బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో పర్యటించి అనంతరం శివాలయం ఘాటు వద్దకు చేరుకున్నారు. శివాలయం ఘాటు వద్ద స్నానానికి దిగి భార్య కుమారులు చూస్తుండగానే నీటి ప్రవాహంలో రాంబాబు కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న సాగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పుట్టిలలో వెతికినా రాంబాబు ఆచూకీ లభ్యం కాలేదు. 26 గేట్ల ద్వారా నీటి విడుదల జరుగుతూ ఉండటంతో నీటి అధికంగా ఉంది. రాంబాబు భార్య సుహాసిని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నాగార్జున సాగర్ సందర్శనలో విషాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES