- Advertisement -
నవతెలంగాణ నవాబుపేట: వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల పరిధిలోని ఇప్పటూరు గ్రామంలో పండుగ పూట తీవ్ర విషాదం నెలకొంది. గురువారం ఉదయం గ్రామ ఉపసర్పంచ్ గుర్రం సూరి అలియాస్ బెస్త సూరి (40) గుండెపోటుతో మృతి చెందారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గ్రామ 4వ వార్డు మెంబర్ గా ఎన్నికైన ఆయనను సహచర వార్డు సభ్యులు, సర్పంచ్ ఏకగ్రీవంగా ఆయనను ఉప సర్పంచ్ గా ఎంపిక చేశారు. సూరి ఆకస్మికంగా మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
- Advertisement -


