Tuesday, October 21, 2025
E-PAPER
Homeకరీంనగర్పండగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

పండగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

- Advertisement -

మరో ఇద్దరికి స్వల్ప గాయాలు     
బైకు, చెట్టును ఢీకొన్న కారు ..
మృతుల్లో సాయి విన్నర్స్ ఎడ్జ్ యజమాని
కొండన్నపల్లి బస్ స్టేజీ వద్ద దుర్ఘటన
నవతెలంగాణ – గంగాధర
గంగాధర మండలం కొండన్నపల్లి గ్రామ బస్ స్టేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు వదలగా, మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు, గంగాధర్ ఎస్సై వంశీకృష్ణ అందించిన వివరాల ప్రకారం.. గంగాధర మండలం కొండన్నపల్లి బస్ స్టేజి వద్ద మంగళవారం ఉదయం మారుతి కారు ఎదురుగా వచ్చిన బైక్ ను ఢీకొని, ఆ తర్వాత చెట్టును ఢీకొంది. ఈ దుర్ఘటనలో కారు నడుపుతున్న వ్యక్తి, బైక్ పై వెళ్తున్న వ్యక్తి ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. కరీంననగర్ జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న కొండన్నపల్లి నివసిస్తున్న తొర్రికొండ మల్లయ్య దీపావళి పండుగ నోము జరుపుకోవడానికి తన భార్య విమల, అతని సోదరి కనుకవ్వతో కలిసి కారులో స్వగ్రామం వస్తూ కొండన్నపల్లి బస్ స్టేజీ వద్ద బైక్ ను ఢీకొని ఆ తర్వాత చెట్టును ఢీ కొట్టాడు.

దీంతో కారును నడుపుతున్న తొర్రికొండ మల్లయ్య (58) , బైక్ పై వెళ్తున్న రియాజ్ అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. అయితే అదే కారులో ప్రయాణిస్తున్న మృతుడి భార్య విమల, అతని సోదరి కనుకవ్వ స్వల్పంగా గాయపడ్డారు. మండలంలోని మధురానగర్ చౌరస్తాలో సాయి విన్నర్స్ ఎడ్జ్ హైస్కూల్ యజమాని అయిన తొర్రికొండ మల్లయ్య రోడ్డు ప్రమాదంలో మరణించడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. బైక్ పై వస్తూ మృతి చెందిన వ్యక్తి నిజామాబాద్ జిల్లా వాస్తవ్యుడిగా తెలుస్తుంది. మృతదేహాలను కరీంనగర్ సివిల్ ఆస్పత్రికి తరలించి కేసు నమెాదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -