Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్బాసరలో విషాదం.. నదిలో మునిగి నలుగురు మృతి

బాసరలో విషాదం.. నదిలో మునిగి నలుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బాసర సరస్వతీ దర్శనానికి వెళ్లిన భక్తులు ప్రమాదవశాత్తూ గోదావరి నదిలో మునిగిపోయారు. స్నానం కోసం నదిలో దిగిన ఐదుగురు గల్లంతయ్యారు. రాకేశ్‌, వినోద్‌, మదన్‌, రుతిక్‌, భరత్‌ నలుగురి మృతదేహాలను వెలికి తీసిన సహాయక సిబ్బంది.. మరొకరి కోసం నదిలో గాలిస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని బాసర క్షేత్రం వద్ద ఆదివారం ఉదయం ఈ విషాదం చోటుచేసుకుంది. నదిలో స్నానానికి దిగిన భక్తులు గల్లంతవడం చూసి అక్కడున్న వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన నది వద్దకు చేరుకున్న పోలీసులు.. గజ ఈతగాళ్లతో రెస్క్యూ చేపట్టారు. స్థానిక అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లు నలుగురి మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. గల్లంతైన మరొకరి కోసం ఇంకా గాలిస్తున్నారు. కాగా, మృతులంతా హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ వాసులని, అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారని అధికారులు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad