Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్గూడూరులో విషాదం..

గూడూరులో విషాదం..

- Advertisement -

గుండెపోటుతో సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త లక్ష్మీపతి మృతి 
నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు, మాజీమంత్రి 
నవతెలంగాణ – పాలకుర్తి

మండలంలోని గూడూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త వైట్ల లక్ష్మీపతి బుధవారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందడంతో గూడూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. లక్ష్మీపతి గుండెపోటుతో మృతి చెందడంతో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు లతోపాటు తదితరులు లక్ష్మీపతి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  లక్ష్మీపతి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేశారని తెలిపారు. సంఘసంస్కర్తగా, గ్రామీణ వైద్యునిగా గూడూరు గ్రామ ప్రజలకు సేవలందించాడని తెలిపారు.

గుడి బడిని కాపాడుకోవాలని, గ్రామ అభివద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ప్రజలను చైతన్యపరిచాడని తెలిపారు. 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేశాడని కొనియాడారు. లక్ష్మీపతి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని అన్నారు. లక్ష్మీపతి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మొలుగూరి యాకయ్య గౌడ్, వీరమనేని యాకాంతరావు, చిక్కుడు రాములు, గుగ్గిళ్ళ ఆదినారాయణ, పట్టూరి శ్రీనివాస్, బెల్లీ దేవేందర్, ఎండి మదర్, గూడూరు చేనేత సొసైటీ చైర్మన్ రచ్చ కృష్ణమూర్తి, గూడూరు మాజీ సర్పంచ్ మాచర్ల పుల్లయ్య, సిపిఎం మండల కార్యదర్శి మాచర్ల సారయ్య లతోపాటు తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

నివాళులు అర్పించిన మాజీ మంత్రి దయాకర్ రావు ..
గూడూరు గ్రామానికి చెందిన సంఘ సంస్కర్త, గ్రామీణ వైద్యులు వైట్ల లక్ష్మీపతి మృతి చెందడంతో బుధవారం మాజీ మత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లక్ష్మీపతి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. లక్ష్మీపతికి మాజీ మంత్రి దయాకర్ రావు నివాళులు అర్పించడంతో సేవాదళ్ రాష్ట్ర నాయకులు ఆదినారాయణ లక్ష్మీపతి అమరహే, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అని నినాదాలు చేయడంతో మాజీ మంత్రి దయాకర్ రావు నిరాశ చెందినట్లు గ్రామస్తుల ద్వారా సమాచారం.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad