- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కేరళలోని శబరిమల యాత్రకు వెళ్లిన తెలంగాణలోని శంకర్‌పల్లికి చెందిన మల్లికార్జున్ రెడ్డి అనే వ్యక్తి గురువారం గుండెపోటుతో మరణించాడు. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వెళ్లిన ఆయన, స్వామి సన్నిధానానికి చేరుకునే క్రమంలో అస్వస్థతకు గురై కిందపడిపోయాడు. తోటి భక్తులు స్థానిక వైద్యులకు చూపించినా.. అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో శంకర్‌పల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
- Advertisement -



