Sunday, October 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వావిలాలలో విషాదం ..

వావిలాలలో విషాదం ..

- Advertisement -

కుక్క కాటుకు గురైన బాలుడు చికిత్స పొందుతూ మృతి 
నవతెలంగాణ-పాలకుర్తి

మండలంలోని వావిలాల గ్రామానికి చెందిన మైదం శ్రీ చరణ్ కుక్క కాటుకు గురై చికిత్స పొందుతూ మృతి శనివారం రాత్రి చెందడంతో వావిలాలలో విషాదం నెలకొంది. ఆదివారం గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం వావిలాల గ్రామానికి చెందిన మైదం శ్రావణి శ్రీనివాస్ దంపతులు కుటుంబ పోషణలో భాగంగా బతుకుదెరువు కోసం హైదరాబాద్ మాదాపూర్ లో నివాసము ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారని తెలిపారు.

శ్రావణి శ్రీనివాస్ దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు శ్రీ చరణ్ ను గత రెండు నెలల క్రితం హైదరాబాదు మాదాపూర్ లో గల కుక్క కాటు వేసిందని తెలిపారు. కుక్క పాటు వేయడంతో మెరుగైన వైద్యం అందిస్తున్నారని గ్రామస్తులు అన్నారు. గత మూడు రోజుల క్రితం పరిస్థితి విషమించడంతో అస్వస్థకు గురైన శ్రీ చరణ్ ను హైదరాబాదులో గల తార్నాక లో ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు అందించారన్నారు. రాబిస్ వ్యాధితో బాధపడుతూ శ్రీ చరణ్ మృతి చెందాడని, శ్రీ చరణ్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై విలపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుక్కలను నివారించేందుకు చర్యలు చేపట్టి, కుక్క కాటుతో మృతి చెందిన శ్రీ చరణ్ కుటుంబాన్ని ప్రభుత్వాలు ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -