- Advertisement -
నవతెలంగాణ-శంకరపట్నం : శంకరపట్నం మండలం వంకాయగూడెం గ్రామంలో విషాదం నెలకొంది. ఫాలో ఆటో నడుపుతూ, కుటుంబాన్ని పోషిస్తున్న మూల రాకేష్ (35) శనివారం ఉదయం ప్రమాదవశాత్తు హీటర్ షాక్‌కు గురై మరణించారు.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, రాకేష్ ఉదయం హీటర్ ముట్టుకోగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే హుజురాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. అయితే, వైద్యులు పరీక్షించిన తర్వాత అప్పటికే రాకేష్ మృతి చెందినట్లు, నిర్ధారించారు. రాకేష్ మృతితో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి.
- Advertisement -