Saturday, October 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విషాదం..మూడు రోజుల్లో ముగ్గురు మృతి

విషాదం..మూడు రోజుల్లో ముగ్గురు మృతి

- Advertisement -

నవతెలంగాణ –  మిరుదొడ్డి
వరుసగా ముగ్గురు మృతి చెందడంతో, ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బతుకమ్మ పండుగ రోజు నుండి వరుస మరణాలు గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు నింపేలా చేశాయి. మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో బుధవారం బతుకమ్మ పండుగ రోజున వరద రాజయ్య(60) మృతి చెందగా, గురువారం దసరా పండుగ రోజున ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలు ముగిశాక దసరా పండుగ గ్రామంలో జరుగుతుండగా, రాత్రి 9 గంటలకు  సద్ది పున్నరెడ్డి(58) అనారోగ్యంతో మృత్యువాత పడ్డాడు. ఇక శుక్రవారం పున్నరెడ్డి అంత్యక్రియలు మధ్యాహ్నం నిర్వహిస్తున్న సమయంలోనే, గ్రామానికి చెందిన కూరాకుల దేవయ్య(38) అనుమానాస్పదంగా ఇర్కోడ్ వద్ద మృతి చెందినట్లు గ్రామస్తులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకొని దేవయ్య మృతి పై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక శనివారం మృతదేహం గ్రామానికి రావడంతో గ్రామస్తులు అంత్యక్రియలు నిర్వహించారు. ఇలా బతుకమ్మ పండుగ నుండి గ్రామంలో వరుసగా ముగ్గురు మృతి చెందడంతో గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -