Thursday, May 29, 2025
Homeకరీంనగర్విషాదం.. పిడుగుపాటుకు యువకుడి మృతి

విషాదం.. పిడుగుపాటుకు యువకుడి మృతి

- Advertisement -

నవతెలంగాణ – వేములవాడ 
వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన దాసరి లక్ష్మణ్ (26) అనే యువ గొర్లకాపారి మంగళవారం చోటు చేసుకున్న పిడుగుపాటు ఘటనలో దుర్మరణం చెందాడు. ఈ ఘటన ఇల్లంతకుంట మండలం గొల్లపల్లి గ్రామ శివారులో జరిగింది. లక్ష్మణ్ తలపైన పెద్ద శబ్దంతో పిడుగు పడడంతో  ఒక్కసారిగా కుప్పకూలాడు,పిడుగుపాటు తో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. స్థానికులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పోలీస్‌, రెవెన్యూ సిబ్బంది మృతదేహానికి   పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లక్ష్మణ్ ది నిరుపేద కుటుంబం కావడంతో ఆ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరిగే ప్రమాదం ఉంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -