నవతెలంగాణ -తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో గత సంవత్సరం 2024 ఆగస్టు 31 రాత్రి డోర్నాడోల్ తరహాలో భారీ సుడిగాలి వచ్చి 500 ఎకరాల్లో 50 వేల రకరకాల వృక్షాలు నేలమట్టమైన, అటవీ ప్రాంతాన్ని ఫారెస్ట్ అకాడమీ దూలపల్లి లో శిక్షణ పొందుతున్న 37వ బ్యాచ్ సంబంధించిన శిక్షణ పొందుతున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు (ట్రైనింగ్ బీట్ ఆఫీసర్లు) మంగళవారం ములుగు జిల్లా అటవీశాఖ అధికారులతో కలిసి వచ్చి సందర్శించి పరిశీలించారు. ములుగు జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, ఏటూరు నాగారం ఎఫ్ డి ఓ రమేష్ ల ఆధ్వర్యంలో చెట్టు కూలిన ప్రాంతాన్ని పరిశీలించి అధ్యయనం చేశారు. చెట్లు ఎందుకు కూలిపోయాయి, అక్కడి పరిస్థితులేమిటి తదితర అంశాలపై అధ్యయనం చేశారు. వీరికి రాహుల్ కిషన్ జాదవ్ జిల్లా అటవీశాఖ అధికారి, ఎఫ్డిఓ రమేష్ లు వివరించారు. చెట్లు సుడిగాలికి నేలమట్టమైన విషయాన్ని శిక్షణ పొందుతున్న బీట్ ఆఫీసర్లు అధ్యయనం చేశారు. అనంతరం మేడారంలోని చిలకలగుట్ట అడవి ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. అడవులను ఎలా రక్షించాలి, పర్యావరణాన్ని ఎలా కాపాడాలి, అడవులు కలప స్మగ్లింగ్ కాకుండా ఎలా కాపాడాలి అనే అంశాలపై అటవీ శిక్షణ పొందుతున్న బీట్ ఆఫీసర్లు కు ములుగు అటవీశాఖ అధికారులు వివరించారు. అనంతరం మేడారంలోని వనదేవతలను దర్శించుకున్నారు.
మేడారంలోని వనదేవతలను దర్శించుకున్న శిక్షణ పొందుతున్న అటవీ శాఖ బీట్ ఆఫీసర్లు రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ పొందుతున్న అటవీ శాఖ బీట్ ఆఫీసర్లు మంగళవారం అడవి ప్రాంతాలను పరిశీలించిన అనంతరం సమ్మక్క- సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు. వనదేవతలకు ఇష్టమైన పసుపు కుంకుమ చీరే సారే సమర్పించి ప్రత్యేక మొక్కలు చెల్లించారు. ఎండోమెంట్ సిబ్బంది, పూజార్లు శిక్షణ పొందుతున్న అటవీశాఖ అధికారులకు ఆలయ సాంప్రదాయాల ప్రకారం డోలు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. వనదేవతలకు ప్రత్యేక మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో ములుగు అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, ఏటూరు నాగారం ఎఫ్ డి ఓ రమేష్, ఎఫ్ ఆర్ ఓ పి నరేందర్, డీఆర్వో కృష్ణవేణి, వివిధ మండలాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.