Tuesday, January 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయందుబ్బుల కొలుపు వృత్తి కళాకారులకు శిక్షణా శిబిరం

దుబ్బుల కొలుపు వృత్తి కళాకారులకు శిక్షణా శిబిరం

- Advertisement -

– భాషా-సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్‌ ఏనుగు నరసింహా రెడ్డి
– తెలంగాణ దుబ్బుల కొలుపు కళాకారుల సంఘం క్యాలెండర్‌ ఆవిష్కరణ
నవతెలంగాణ-కల్చరల్‌

మరుగుపడుతున్న గ్రామీణ ప్రాచీన వృత్తి దుబ్బుల కొలుపు కళను కాపాడేందుకు ఆ వృత్తి కళాకారులకు భాషా సాంస్కృతిక శాఖ నిర్వహణలో శిక్షణ శిబిరం నిర్వహిస్తామని ఆ శాఖ సంచాలకులు డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి తెలిపారు. తెలంగాణ దుబ్బుల కొలుపు కళాకారుల సంఘం 2026 సంవత్సర క్యాలెండర్‌ను సోమవారం హైదరాబాద్‌ రవీంద్ర భారతి లోని భాషా సాంస్కృతిక శాఖ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించి మాట్లా డారు. దుబ్బుల కొలుపు కళాకారుల సంఘం సూచనలను సాను కూలంగా పరిశీలిస్తామని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ, వృత్తి సంఘాల నాయకులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన అత్యంత ప్రాచీన సంప్రదాయ కళలను నిర్లక్ష్యం చేశారని, అందులో దుబ్బుల కొలుపు కళ ప్రధానమైందని అన్నారు. రాష్ట్రం లో సుమారు 5 వేల మంది ఈ వృత్తి కళాకారులు ఉన్నారని,
శుభకార్యాల్లో కళాప్రదర్శనలు ఇస్తారని తెలిపారు. ఈ వృత్తిలోని కుటుంబాల యువతకు మెరుగైన శిక్షణ అందించాలని, రాబోయే బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలని, రుణాలు, గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ దుబ్బుల కొలుపు కళా కారుల సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారు లెల్లెల బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి బి.శ్రీకాంత్‌, కార్యనిర్వాహక అధ్యక్షులు జునగరి గణేష్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు మాటూరి సంతోష్‌, కార్యవర్గ సభ్యులు బోగిరి సంతోష్‌, జునగరి లక్ష్మణ్‌, గిరుగుల సమ్మయ్య, సౌతకారి మదనయ్య, డోకే కృష్ణంరాజు, ఊడే మొగిలి, జునగరి రాజేందర్‌, సౌతాకారి ప్రసాద్‌, మాటూరి సమ్మయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -