- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు(కాటారం) : ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు కాటారం మండల పరిధిలో బిఎల్ఓ లకు రైతు వేదికలో బుధవారం తహసిల్దార్ నాగరాజు ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడారు మండలంలో బిఎల్ఓ 36, సూపర్వైజర్స్ 4 ఉన్నారని తెలిపారు. బి ఎల్ వో లు విధినిర్వహణలో తీసుకోవలసిన జాగ్రత్తలు, వివిధ అప్లికేషన్లపై ఫుల్ ఫిల్ చేయడానికి అవసరమైన విధి విధానాలను, వాటికి సంబంధించిన సర్టిఫికెట్ సేకరణ వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ రామ్మోహన్ గౌడ్, సూపర్ వైజర్లు, బి ఎల్ వోలు పాల్గొన్నారు.
- Advertisement -