నవతెలంగాణ – బజార్ హాత్నూర్
మండలంలోని అన్ని గ్రామపంచాయతీలకు సంబంధించిన నూతన వార్డు సభ్యులకు మంగళవారం శిక్షణ తరగతులను ఎంపీడీవో శ్రీనివాస్ ప్రారంభించారు. ఇందులో భాగంగా శిక్షణ అధికారులు వార్డు సభ్యులకు గ్రామ పాలనలో వ్యవస్థలు, పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పంచాయతీలకు అధికారాలు, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు బాధ్యతలు, ప్రాథమిక లక్ష్యాలు, నాయకత్వ లక్షణాలు, పారిశుధ్యం, సమావేశాలు, స్టాండింగ్ కమిటీల ఏర్పాటు, వన మహోత్సవం, నిధులపై ఆడిట్, ప్రజా ఆరోగ్యం, జనన, మరణాల నమోదు, ఈ-అప్లికేషన్, ఆర్థిక ప్రణాళిక తదితర 24 అంశాలపై శిక్షణ, చట్టాన్ని అతిక్రమిస్తే సర్పంచులపై ఎలాంటి చర్యలు ఉంటాయనే విషయాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ మహేందర్ రెడ్డి, శిక్షణ అధికారులు, ఉప సర్పంచులు, వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
నూతన వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



