Wednesday, September 17, 2025
E-PAPER
Homeజిల్లాలుముగిసిన అంగన్‌వాడీలకు టీచర్లకు శిక్షణ తరగతులు

ముగిసిన అంగన్‌వాడీలకు టీచర్లకు శిక్షణ తరగతులు

- Advertisement -


నవతెలంగాణ-పెద్దవూర
అనుముల తి ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని పెద్దవూర మండలకేంద్రం లోని ఎంపీడీఓ కార్యాలయం లో గత మూడు రోజులుగా జరిగిన శిక్షణా తరగతులు బుధవారంతో ముగిసాయి. ఈసందర్బంగా అనుముల ఐసీడీఎస్ సీడీపీఓ ఉదయశ్రీ ప్రారంభిచారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ట్రైనర్స్ సూపర్వైజర్స్ మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో సాల్ట్ గురించి నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఈసీ గురించి చక్కగా వివరించారు. ఐదు ఏండ్లలోపు పిల్లల్లో మెదడు అభివృద్ధి శాతం పెరుగుతుందని, ఈ వయసులో పిల్లలను సమగ్ర అభివృద్ధి జరగాలని తెలిపారు.పిల్లల్లో శారీరక, మానసిక భాష మేధో మరియు సృజనాత్మకత అభివృద్ధిలో జరగాలని అన్నారు.

అభివృద్ధి జరగకపోతే పిల్లల్లో వచ్చే సమగ్ర అభివృద్ధి జరగదని టీచర్లకు మంచిగా అవగాహన కలిగించారు. వివిధ రకాలైన టీఎల్ఎంను ఎలా తయారు చేసుకోవాలో తెలిపారు. గ్రాడ్యుయేషన్ డే వెల్కమ్ చెప్పడం వల్ల పిల్లల్లో అభివృద్ధి చక్కగా జరుగుతుందని అంగన్వాడీ టీచర్లకు అవగాహన కలిగించారని తెలిపారు. 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల శారీరక, మానసిక మరియు సామాజిక అభివృద్ధికి సంబంధించిన అంశాలపై, పిల్లలకు సరైన ప్రాథమిక విద్యను అందించడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందని తెలిపారు.

ఆటలు, కథలు, పాటలు వంటి పద్ధతుల ద్వారా బోధించడం, పోషకాహారం మరియు ఆరోగ్య విద్య, పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలకు అవసరమైన పోషకాహారం, ఆరోగ్యంపై అవగాహన కల్పించామని తెలిపారు. పిల్లలకు టీకాలు వేయించడం ప్రాముఖ్యతను వివరించడం మరియు ఆరోగ్య కేంద్రాలకు వారిని రిఫర్ చేయడం వంటివి శిక్షణలో తెలియజేశామని తెలిపారు. అనుముల ప్రాజెక్టులోని మండలం 255 మంది అంగన్‌వాడీ టీచర్లకు బ్యాచ్‌ల వారీగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక్కో బ్యాచ్‌కు మూడురోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించామని అన్నారు. కార్యక్రమంలో ఏసీడీపిఓ సువర్ణ, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, వెంకాయమ్మ,శశికళ,గౌసియాబేగం అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -