– సీడీపీఓ ముత్తమ్మ
నవతెలంగాణ – అశ్వారావుపేట
నాణ్యమైన బాల్య అభివృద్ధి, సంరక్షణ,విద్య యొక్క సార్వత్రిక ఏర్పాట్లను 2030 లోపు సాధించే దిశగా చూడటమే ” పోషణ భీ పదాయి భీ” కార్యక్రమం ఉద్దేశ్యం అని సీడీపీఓ ముత్తమ్మ అన్నారు. ఈ కార్యక్రమంపై అంగన్వాడీ ఉపాద్యాయులకు సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం సమావేశ ప్రాంగణంలో శిక్షణా శిబిరం నిర్వహించారు. శ్రీ శిశు సంక్షేమ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదగా 2023 మే 10 వ తేదీన ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా నవజాత శిశువులు నుండి ఆరు సంవత్సరాల పిల్లలలో అన్ని రకాల అభివృద్ధి లను,పోషణ పూర్తిస్థాయిలో అందించే విధంగా ఇందులో అంగన్వాడీ ఉపాద్యాయులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో సీడీపీఓ ముత్తమ్మ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని పూర్తి స్థాయిలో కేంద్రాలలో అమలు చేయాలని మంచి మెరుగైన పనితనాన్ని ప్రదర్శించాలని టీచర్లకు ఆదేశించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ఏసీడీపీఓ అలేఖ్య, సూపర్వైజర్లు సౌజన్య, పద్మావతి,రమాదేవి,వరలక్ష్మి, పోషణ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ పాల్గొన్నారు