- Advertisement -
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
జూనియర్ అసిస్టెంట్ నూతనంగా ఎంపికైన వారికి శిక్షణ ఈనెల 8 నుండి 18 వరకు ఉంటుందని పర్యవేక్షకులు శ్రీనివాసరావు సునీత దేవి భరత్ తెలిపారు. వివిధ అంశములపై ప్రత్యేకంగా ఎస్టాబ్లిష్మెంట్, అకౌంట్స్ నందు పూర్తి అవగాహన కొరకై జిల్లా పరిషత్ సీఈవో సాయి గౌడ్, డిప్యూటీ సీఈఓ సాయన్న ఆధ్వర్యంలో ఈ శిక్షణా కార్యక్రమం జరుగుతుందని లింగన్న , శ్రీనివాసన్ లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్ జిల్లా మిస్టేరియల్ సంఘ జిల్లా అధ్యక్షుడు గడ్డం భాస్కర్ సెక్రెటరీ ప్రదీప్ కుమార్ ట్రెజరర్ విట్టల్ అసోసియేట్ ప్రెసిడెంట్ శంకర్ రాజు సిద్దు పటేల్ ఇట్టి శిక్షణ తరగతులకు హాజరయ్యారు.
- Advertisement -