Tuesday, February 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు శిక్షణ 

నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు శిక్షణ 

- Advertisement -

నవతెలంగాణ- కాటారం
నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయం, కాటారంలో నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ఎంపీడీవో అడ్డూరి బాబు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో అడ్డూరి బాబు మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ ప్రజా ప్రతినిధులు ప్రజాసేవలో కీలక పాత్ర పోషించాలని, గ్రామాభివృద్ధికి ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. పరిపాలనా విధానాలు, విధులు, బాధ్యతలపై వార్డు సభ్యులకు సంక్షిప్తంగా అవగాహన కల్పించారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో శిక్షకులు (TOTS)గా పంచాయతీ కార్యదర్శులు పందిరి శ్రీనివాస్, డి. రాజశేఖర్ (కాటారం), చిట్యాల మండలం నుంచి బి. దేవేందర్ రెడ్డి, కే. మహేష్ హాజరై వార్డు సభ్యులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణకు కాటారం మండల పరిధిలోని గుండ్రాత్పల్లి, దామరకుంట, విలాసాగర్, గంగారం, రేగులగూడెం, శంకరంపల్లి, ధన్వాడ, గుమ్మాలపల్లి, ధర్మసాగర్, ఓడిపిలవంచ, వీరాపూర్, జాదారావుపేట్ గ్రామపంచాయతీలకు చెందిన వార్డు సభ్యులు హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -