Saturday, May 10, 2025
HomeUncategorizedఫార్మసీ ఆఫీసర్లకు శిక్షణ…

ఫార్మసీ ఆఫీసర్లకు శిక్షణ…

- Advertisement -

ముఖ్యఅతిథిగా హాజరైన డిఎంహెచ్వో డాక్టర్ మనోహర్…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
: ఎనీమియా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఒక్కరోజు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫార్మసీ ఆఫీసర్ కు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యాదాద్రి భువనగిరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మనోహర్ హాజరై,  మాట్లాడారు. ఎనిమియ ముక్త్ భారత్ , ఎఫ్ పి ఎల్ఎంఐఎస్ కార్యక్రమాలపై ఫార్మసీ ఆఫీసులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. జీవిత చక్ర విధానంలో గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులతో సహా పిల్లలు , స్త్రీలలో రక్తహీనత తగ్గించడానికి భారత ప్రభుత్వం ఎనిమియా ముక్త్ భారత్ అమలు చేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే  ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించామన్నారు. రాష్ట్ర జాయింట్ డైరెక్టర్  ఆదేశాల మేరకు  రక్తహీనతకు సంబంధించి ఐరన్ పోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ను ఏ విధంగా సప్లై చేయాలి, ఏ గ్రూపు వాళ్లకు ఏ విధంగా సరఫరా చేయాలి , ఏ విధంగా ఉపయోగించాలి అన్న విషయాలపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఫ్యామిలీ ప్లానింగ్ సంబంధించి విషయాలపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం డిఎంహెచ్వోను ఫార్మసీ ఆఫీసర్స్ శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఫార్మసిస్ట్ పేరును ఫార్మసీ ఆఫీసర్గా మార్చడం పట్ల సంబరాలు…

ఫార్మసిస్ట్ పేరును ప్రభుత్వం ఫార్మసీ ఆఫీసర్గా మార్చడం పట్ల ఫార్మసీ ఆఫీసర్లు డిఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్ చేత 

 కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. జిల్లా పోగ్రామ్ అధికారులు డాక్టర్ యశోద, డాక్టర్ వీణ కుమారి, జిల్లా ఆరోగ్య బోధకులు సత్యనారాయణ, అంజయ్య, జిల్లా ఆశాల నోడల్ ఆఫీసర్ సత్యవతి, జిల్లా అధికారులు,  ఫార్మసీ ఆఫీసర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -