- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధమవుతోంది ఈ నెల 9 నుండి ప్రారంభమయ్యే స్థానిక సంస్థల ఎన్నికలకు మద్నూర్ డోంగ్లి మండలాల్లో ఎన్నికల అధికారులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. సోమవారం మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మద్నూర్, డోంగ్లి ,మండలాలకు చెందిన పిఓ, ఏపిఓ లకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ తరగతుల్లో డోంగ్లి మండల ఎంపీడీవో వెంకట నరసయ్య మద్నూర్ మండల తాసిల్దార్ ఎండి ముజీబ్ అధ్యక్షతన శిక్షణ తరగతులు జరిగాయి. ఈ శిక్షణ తరగతులకు మద్నూర్ మండలంలో ఎన్నికల అధికారులు డోంగ్లి మండల ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -