నవతెలంగాణ – అశ్వారావుపేట: తెలంగాణ ప్రభుత్వం,పాఠశాల విద్యాశాఖ విద్యార్ధులు కోసం నిర్వహిస్తున్న వేసవి శిబిరం విజయవంతంగా కొనసాగుతుంది. అశ్వారావుపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణా శిబిరంలో ప్రధానోపాధ్యాయురాలు పి.హరిత ఆధ్వర్యంలో గురువారం విద్యార్ధులు సీడ్ బాల్స్ తయారు చేశారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చింత, టేకు,పనస,తునికి,సపోటా వంటి వివిధ రకాల విత్తనాలను సేకరించారు. వాటితో గురువారం సీడ్ బాల్స్ తయారు చేశారు. వీటిని వర్షాకాలంలో అటవీ అధికారులకు అప్పగించనున్నట్లు తెలిపారు.పాఠశాలలో నిర్వహిస్తున్న కిచెన్ గార్డెన్ లో కలుపు తీసి పాదులు తవ్వారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు హరిత మాట్లాడుతూ విద్యార్ధులలో వ్యవసాయం, అటవీ సంరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించామని ఈ కార్యక్రమం ద్వారా విద్యార్ధులకు సామాజిక బాధ్యత పెంపొందుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఊడల కిషోర్ బాబు, వెంకటేశ్వర్లు,పి.ఇ.టి రాజు, సి.ఆర్.పి ప్రభాకరాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
సీడ్ బాల్స్ తయారీపై విద్యార్ధులకు శిక్షణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES