Saturday, May 17, 2025
Homeతెలంగాణ రౌండప్ఉపాధ్యాయులకు శిక్షణ

ఉపాధ్యాయులకు శిక్షణ

- Advertisement -
  • – మూడు విడతలలో..
  • – 13 నుండి 17 వరకు మొదటి విడత
  • – 20 నుండి 24 వరకు రెండవ విడత
  • – 27 నుండి 30 వరకు మూడవ విడత
    నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
    ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం అనుగుణంగా ఉపాధ్యాయుల విద్యా బోధన పటిష్టం చేయటం, ముఖ్యంగా ఆయా సబ్జెక్టులకు సంబంధించి వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించేందుకు విద్యాశాఖ ప్రభుత్వ ఉపాధ్యాయులకు వేసవి సెలవుల్లోనే వృత్తాంతర శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇంగ్లీషు, సోషల్ స్టడీస్ ,బయోసైన్స్, ఫిజికల్ సైన్స్, తెలుగు సబ్జెక్టులపైశిక్షణ ఇవ్వడంతో పాటు, ప్రాథమిక స్థాయిలో ఎఫ్ ఎల్ ఎన్ శిక్షణ ఇస్తున్నారు. ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు లర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ కింద బోధనా ప్రక్రియలను పెంపొందించేందుకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టారు.
    మూడు విడతలలో..
    నల్లగొండ జిల్లాలో 33 మండలాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు మూడు మూడు విడతలలో ఒక్కొక్క విడతకు ఐదు రోజులపాటు శిక్షణ ఇస్తున్నారు.మొదటి విడత , 13 నుండి 17 వరకు రెండవ విడత 20 నుండి 24 వరకు మూడవ విడత. 27 నుండి 30 వరకు శిక్షణ కొనసాగనుంది.జిల్లా వ్యాప్తంగా ఈ నెలాఖరులోపు శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించడం జరిగింది. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు ఇక్కడ శిక్షణ పొందిన రిసోర్స్ పర్సన్లు ఆయా పాఠశాలల పరిధిలో ఎంపిక చేసిన ప్రాంతంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు ఇంగ్లీషు, సోషల్ స్టడీస్ ,బయోసైన్స్, ఫిజికల్ సైన్స్, తెలుగు సబ్జెక్టులపై సెయింట్ ఆల్ఫాన్సెస్ లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
    3 డి పద్ధతిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్
    టీచింగ్ లెర్నింగ్ మెథడ్ తోపాటు, 3 డి పద్ధతిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం వంటి వాటి పట్ల ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. నిత్యం విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో బోధించడంతోపాటు ఆకట్టుకునే పద్ధతిలో శిక్షణ కొనసాగిస్తున్నారు.
    వృత్తి నైపుణ్యం శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి.
    కలెక్టర్ ఇలా త్రిపాఠి
    వృత్తి నైపుణ్యం పెంపుదలకై ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ఈనెల 13 నుండి జిల్లాలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలలో భాగంగా శనివారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని సెయింట్ ఆల్ఫోన్సెస్ పాఠశాలలో ఇస్తున్న శిక్షణ శిబిరాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని స్థాయిలలో ఇచ్చే శిక్షణ కార్యక్రమాలను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకొని ఇంకా మెరుగైన పద్ధతిలో విద్యార్థులకు బోధించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ శిక్షణ శిబిరంలో జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, కోర్స్ డైరెక్టర్లు నల్గొండ ఎంఈఓ అరుంధతి, నకిరేకల్ ఎంఈఓ నాగయ్య, చిట్యాల ఎంఈఓ సైదయ్య, తదితరులు ఉన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -