Sunday, February 8, 2026
E-PAPER
Homeనల్లగొండపదవ తరగతి విద్యార్థులకు శిక్షణ..

పదవ తరగతి విద్యార్థులకు శిక్షణ..

- Advertisement -

జిల్లా కేంద్రంలో విద్యార్థులకు మోటివేషనల్ పాఠాల పై శిక్షణ తరగతులు ఏర్పాటు.
ఎస్సీ సంక్షేమ శాఖ సూపర్నెంట్, ఏ ఎస్ డి ఓ కె. లత..
నవతెలంగాణ-సూర్యాపేట కలెక్టరేట్

జిల్లాలో షెడ్యూల్ కులాలకి చెందిన పదవ తరగతి విద్యార్థిని,విద్యార్థులకు మోటివేషనల్ పాఠాల పై ఏ ఎస్ డి ఓ సూర్యాపేట డివిజన్ పరిధిలో విద్యార్థులకు ప్రేరణ శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని ఎస్సీ సంక్షేమ శాఖ సూపర్నెంట్,ఏ ఎస్ డి ఓ (ఎఫ్ ఏ సి)కే.లత అన్నారు.ఆదివారం ఏఎస్సీడీ ఓ సూర్యాపేట పరిధిలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.పరీక్ష ల లో విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి ఆలోచించి పరీక్ష వ్రాయాలని మంచి పలితాలు సాధించాలని సూచించారు.షెడ్యూల్ కులానికి చెందిన విద్యార్థిని విద్యార్థులు తప్పనిసరిగా ఈ శిక్షణ తరగతులను ఉపయోగించుకోవాలని అన్నారు.రానున్న పదవ తరగతి పరీక్షలలో విద్యార్థిని విద్యార్థులు 100 శాతం మార్కులు తగ్గకుండా చదువుకొని జిల్లాలో ముందంజలో ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమ అధికారులు కె.ఉప్పలయ్య,ఈ.ఇందిర, టి.భాస్కర్ ఆర్.నిర్మల, పి.వాణిజోష్న,ఏ.మహబూబ,పి.ముత్యాలరావు, ఎస్కె.ఉస్మాన్,ఎస్.కమలాకర్,వై.నాగరాజు,డి.దేవదాసు,టీచర్స్.వెంకన్న,(సైన్స్)గురుచరణ్,(ఇంగ్లీష్)సత్యనారాయణ(హిందీ)జగదీష్,మ్యాథ్స్)ఎస్ సి డి డి వసతి గృహ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -