Saturday, December 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యువ కిశోర బాలురకు లింగ సమానత్వంపై శిక్షణ

యువ కిశోర బాలురకు లింగ సమానత్వంపై శిక్షణ

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బేటి బచావో – బేటి పడావో కార్యక్రమంలో భాగంగా, మహిళా–శిశు–వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏ ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా  ప్రాజెక్ట్ పరిధిలోని  పిప్రి గ్రామ శివారులోని ప్రభుత్వ బాయ్స్ జూనియర్ కాలేజీలో శనివారం యువ కిశోర బాలురకు లింగ సమానత్వంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసిడిఎస్ సిడిపిఓ శ్రీమతి భార్గవి  హాజరై మాట్లాడుతూ.. సమాజంలో కొనసాగుతున్న లింగ వివక్షతపై మాట్లాడారు. బాలురు–బాలికల మధ్య సమానత్వం పాటించాల్సిన అవసరాన్ని వివరించి, భవిష్యత్‌లో బాలుర పాత్ర ఎంతో కీలకమని తెలిపారు.జిల్లా మిషన్ కోఆర్డినేటర్ శ్రీమతి సప్న  మాట్లాడుతూ, బేటి బచావో – బేటి పడావో కార్యక్రమ లక్ష్యాలను వివరించి, లింగ వివక్షత నిర్మూలనకు యువత భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. ఏఆర్  ఎడ్యుకేషన్ ట్రైనర్ శ్రీమతి శిరీష  సైకాలజిస్ట్ మాట్లాడుతూ.. సమాజంలో జరుగుతున్న లింగ వివక్షత అంశాలను ఉదాహరణలతో వివరించి, యువ కిశోర బాలురలో లింగ సమానత్వంపై అవగాహన పెంపొందించాల్సిన అవసరాన్ని తెలిపారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో బాలురు–బాలికల మధ్య సమాన హక్కులు, గౌరవం, పరస్పర అవగాహన గురించి వివరించడంతో పాటు, మహిళలు మరియు బాలికలపై వివక్ష, హింసను నివారించడంలో బాలుర పాత్ర ఎంతో ముఖ్యమని , బాల్యవివాహాలు, బాలలపై దుర్వినియోగం వంటి సామాజిక సమస్యలపై చర్చించి, సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడంలో యువత బాధ్యతను గుర్తు చేశారు. ఈ శిక్షణ ద్వారా యువ కిశోర బాలురలో సానుకూల దృక్పథం పెరిగి, లింగ సమానత్వాన్ని పాటించే సమాజ నిర్మాణానికి వారు తోడ్పడతారని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ , లెక్చరర్స్ విద్యార్థులు డిహెచ్ఈ డబ్ల్యు  సిబ్బంది  పుష్ప, కవిత, సౌమ్య ,ఐసిడిఎస్ సూపర్వైజర్ నలిని తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -