నవతెలంగాణ – బిచ్కుంద
బిచ్కుంద పట్టణంలోని తహసీల్ కార్యాలయంలో సూక్ష్మ నీటిపారుదల గణన, నీటి వనరుల గణన నమోదుపై గణనదారులకు(జీపీవోలకు) తహసిల్దార్ వేణుగోపాల్ అధ్యక్షతన శిక్షణ కార్యక్రమము నిర్వహించారు. నీటి కుంటలు, చెరువులు, సూక్ష్మ నీటి పారుదల వనరులను లెక్కించాలని వీటిని మైనర్ ఇరిగేషన్ సెన్సస్ మొబైల్ యాప్ లో క్షేత్ర స్థాయికి వెళ్లి నమోదు చేయాలని ఈ నమోదుతో నీటి వనరుల లభ్యత గురించి తెలియనుందన్నారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు పట్టేదారులు రైతులందరిని భాగ్యస్వామ్యం చేసి నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ దత్తు, ఎన్యుమరెటర్స్ పాల్గొన్నారు.
సూక్ష్మ నీటిపారుదల గణనపై శిక్షణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



