Tuesday, February 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమీడియా అకాడమీ ఆధ్వర్యంలో రిపోర్టింగ్‌పై శిక్షణ

మీడియా అకాడమీ ఆధ్వర్యంలో రిపోర్టింగ్‌పై శిక్షణ

- Advertisement -

– అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు
నవతెలంగాణ బ్యూరో-హైదారాబాద్‌

భూ హక్కులు, వ్యవసాయ, గ్రామీణాభివృద్ది, పర్యావరణ రిపోర్టింగ్‌పై ఒక్క రోజు శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నాంపల్లిలోని తెలగాంణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. భూ చట్టాలు- భూ సమస్యల పరిష్కారం, వ్యవసాయం-అనుబంధ రంగాల్లో ప్రభుత్వ స్కీములు, బ్యాంకు రుణాలు, పర్యావరణ భద్రత, చెరువులను కాపాడుకోవడం, జర్నలిస్టుల నైతిక నియమావళి, మీడియా-చట్టాలు, డిజిటల్‌ రిపోర్టింగ్‌, వ్యవసాయం, రైతు సమస్యలు, గ్రామీణ ప్రాంతాలు, రెవెన్యూ అంశాలపై జర్నలిస్టులకు అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు. రిపోర్టింగ్‌లో పర్యావరణ, సాంకేతిక అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా నిపుణులు వివరించ నున్నట్టు పేర్కొన్నారు. మీడియా రంగం వేగంగా రూపాంతరం చెందుతున్న నేపథ్యం లో జర్నలిస్టులు నూతన సాంకేతిక పరి జ్ఞానాన్ని అవగాహన చేసుకుని, సమాజానికి నిష్పక్షపాత, బాధ్యతాయు తమైన సమాచారం అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -