సర్టిఫికెట్ అందుకున్న ఆర్టీఐ జిల్లా కోకన్వీనర్ కుమార్ యాదవ్
నవతెలంగాణ-మల్హర్ రావు
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 25,డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఎంసిఆర్ కేంద్రంలో ఈ నెల 16,17,18 మూడు రోజులపాటు ప్రభుత్వ పథకాల అమలుపై (ఎన్జీవో) నాన్ గౌట్ ఆర్గనైజేషన్ (వర్క్ షాప్) సెమినార్ మూడు రోజులపాటు సెమినార్ జి.జాన్సీ రాణి ప్యాకల్టీ, డాక్టర్ కే.ఉషారాణి సీనియర్ ప్యాకల్టీ, శ్రీనివాస్ మాధవ్ ప్యాకల్టీ, రవిందర్ రావు ప్రాజెక్టు డైరెక్టర్, సతీష్ కుమార్ ఐఏఎస్, వైస్ ఛైర్మన్, అండ్ జనరల్ డైరెక్టర్ తదితర ఉన్నతాధికారులచే మూడురోజుల సెమినార్ కు మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన ఎన్జీఓ, ఆర్టీఐ జిల్లా కోకన్వీనర్ చింతల కుమార్ యాదవ్ హాజరై శిక్షణ బుధవారం పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ప్యాకల్టీ ఉన్నతాధికారులచే ప్రశంస పత్రంతోపాటు సర్టిఫికెట్ గురువారం అందజేశారు.ఇందుకుయునైటెడ్ ఫోరమ్ పర్ ఆర్టీఐ క్యాంపియన్ తెలంగాణ ద్వారా ఆర్టీఐ రాష్ట్ర కన్వీనర్ ఎం.మహేష్, స్టేట్ ఆర్గనైజింగ్ కన్వీనర్ యస్.వెంకటేశ్వర్లు, మహిళ విభాగం రాష్ట్ర కన్వీనర్ సోమలక్ష్మీ, జిల్లా కన్వీనర్ వెంకటేశ్వర్లు గౌడ్ లకు కుమార్ యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.



