నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇటీవల జరిగిన రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు శిక్షణ కార్యక్రమం ఉంటుందని జిల్లా పంచాయతీ అధికారి మురళి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం 2026 జనవరి 19 నుంచి ఫిబ్రవరి 28 వరకు దశలవారీగా నిర్వహించనున్నారు. కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (రూసా బ్లాక్)లో ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు శిక్షణ కొనసాగనుంది. లింగంపేట్, దోమకొండ, బాన్సువాడ, భిక్నూర్, సదాశివనగర్, బీర్కూర్, గాంధారి, బిబిపేట్, యల్లారెడ్డి, మాచారెడ్డి, మద్నూర్, పిట్లం తదితర మండలాలకు చెందిన మొత్తం 532 మంది సర్పంచులు ఈ శిక్షణలో పాల్గొననున్నారు. గ్రామ పాలన, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై సర్పంచులకు అవగాహన కల్పించడమే ఈ శిక్షణ కార్యక్రమ లక్ష్యమని ఆయన తెలిపారు.
జనవరి 19 నుంచి నూతన సర్పంచులకు శిక్షణా కార్యక్రమం: డీపీఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



