నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ లో ట్రైన్స్ లు యధావిధిగా ప్రారంభం అయ్యాయని రైల్వే స్టేషన్ ఎస్ఐ సాయి రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం రైల్వే స్టేషన్ లో ట్రైన్స్ రాకపోకలను వీడియో ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శుక్రవారం బాసర-గోదావరి రైల్వే బ్రిడ్జి(రైల్వే ట్రాక్) పై వరకు వాటర్ లెవెల్ పెరగడంతో నాందేడ్ టు నిజామాబాద్, నిజామాబాద్ టు నాందేడ్ కు ట్రైన్స్ ను రద్దు చేశారు. శనివారం కొద్దిగా వరదా ఉద్రిక్తత తగ్గడం తో, సంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది ఆదివారం విసిట్ చేసి పైన ఉన్నతాధికారుల ఆదేశాలతో ట్రైన్ లను ఉదయం నుంచి యధావిధిగా ప్రారంభించడం జరిగిందని తెలిపారు. అయితే విశాఖ నుంచి ట్రైన్ లు రావడం జరిగిందని, నాందేడ్ నుంచి ట్రైన్ లు వస్తున్నాయని ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
యధావిధిగా ట్రైన్స్ ప్రారంభం: రైల్వే స్టేషన్ ఎస్ఐ సాయి రెడ్డి
- Advertisement -
- Advertisement -