Thursday, January 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వంగిన కరెంటు స్తంభాలను సరిచేసిన ట్రాన్స్కో సిబ్బంది

వంగిన కరెంటు స్తంభాలను సరిచేసిన ట్రాన్స్కో సిబ్బంది

- Advertisement -

రైతుల్లో హర్షం..
నవతెలంగాణ- మద్నూర్

మద్నూర్ మండల కేంద్రం నుండి మోగా రోడ్డు గ్రామ శివారు ప్రాంతంలో కరెంటు స్తంభాలు వంగిన వాటిని ట్రాన్స్కో సిబ్బంది ఏఈ గోపికృష్ణ ఆధ్వర్యంలో వంగిన స్తంభాలను సరి చేయడం పట్ల ఆ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం అవుతుంది. ఈ శివారు ప్రాంతంలో కరెంటు స్తంభాలు వంగిన వాటి గురించి ట్రాన్స్కో అధికారుల దృష్టికి పలువురు రైతులు తీసుకువెళ్లినట్లు తెలిసింది. రైతుల విన్నపం మేరకు వంగిన స్తంభాల మూలంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా ఏఈ గోపికృష్ణ కరెంటు సిబ్బందితో మంగళవారం సరి చేయించారు. రైతుల విన్నపం మేరకు వంగిన కంబాలను సరిచేసినందుకు వ్యవసాయదారులు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -