Friday, April 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం10 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

10 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

- Advertisement -

ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో 10 మంది స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి డిఎస్‌ లోకేశ్‌కుమార్‌ గురువారం (జీవో నెంబర్‌ 211) ఉత్తర్వులు జారీ చేశారు. స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లు రెరాలో డిప్యూటేషన్‌లో ఉన్న డి శ్రీనివాస్‌రెడ్డిని కరీంనగర్‌ అదనపు కలెక్టర్‌గా, హైదరాబాద్‌ డీఆర్‌వో ఈ వెంకటాచారిని వికారాబాద్‌ అదనపు కలెక్టర్‌గా, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో డిప్యూటేషన్‌లో ఉన్న టి వినోద్‌కుమార్‌ను వనపర్తి అదనపు కలెక్టర్‌గా, హెచ్‌సీపీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ కాంపిటెంట్‌ అథారిటీ వి రాములును మంచిర్యాల అదనపు కలెక్టర్‌గా, కరీంనగర్‌ అదనపు కలెక్టర్‌గా కె లక్షికిరణ్‌ను సిద్ధిపేట అదనపు కలెక్టర్‌గా, మైనార్టీ సంక్షేమ శాఖలో డిప్యూటేషన్‌లో ఉన్న ఆర్‌ఎస్‌ చిత్రును ఆదిలాబాద్‌ అదనపు కలెక్టర్‌గా, వెయిటింగ్‌లో ఉన్న డిప్యూటీ కలెక్టర్‌ ఎన్‌ ఆనంద్‌కుమార్‌ను భద్రాచలం టీడబ్ల్యూ ఎస్‌డీసీగా, పౌరసరఫరాల శాఖ వినియోగదారుల వ్యవహారాల్లో డిప్యూటేషన్‌పై ఉన్న జి శ్రీలతను రెరాకు బదిలీ చేశామని తెలిపారు. ఇద్దరు డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతులు కల్పించామని వివరించారు. డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న తిరుపతయ్య నాదేళ్లకు వనపర్తి స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌గా, బత్తుల వనజారాణిని నల్లగొండ ప్రత్యేక కలెక్టర్‌ పీఏగా పోస్టింగ్‌లను ఇచ్చామని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -