ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో 16 మంది అదనపు కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి డిఎస్ లోకేశ్‌కుమార్ బుధవారం (జీవో నెంబర్ 105) ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు కలెక్టర్ జి పద్మజా రాణిని జోగులాంబ గద్వాల జిల్లా డీఆర్‌వోగా, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు జేఎల్‌బీ హరిప్రియను మహబూబ్‌నగర్ అదనపు కలెక్టర్‌గా, కె వెంకటరెడ్డిని యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్‌గా, డి భుజంగరావును ఆదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్‌గా, వి లచ్చిరెడ్డిని సికింద్రాబాద్ స్పెషల్ గ్రేడ్ డిపూటీ కలెక్టర్ ఎస్టేట్ అధికారిగా, టి శ్రీనివాసరావును గద్వాల ఆర్డీవోగా, ఎల్ అలివేలును గద్వాల హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా బదిలీ చేశారు.
డిప్యూటీ కలెక్టర్లు పి రామకృష్ణను నర్సాపూర్ ఆర్డీవోగా, కె పార్థసింహను చేవెళ్ల ఆర్డీవోగా, కె మహిపాల్‌రెడ్డిని శేరిలింగంపల్లి తహశీల్దార్‌గా, ఎన్ శ్రీనివాస్‌ను ఖమ్మం ఆర్డీవోగా, జి నర్సింహారావును మెట్‌పల్లి ఆర్డీవోగా, పి మాధవిదేవిని నల్లగొండ ప్రత్యేక కలెక్టర్ పీఏగా, ప్రభాకర్ రొడ్డను ఎల్లారెడ్డి ఆర్డీవోగా, రవీందర్‌రెడ్డిని కుడా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ చేశారు. డిప్యూటీ కలెక్టర్ వి అరుణను ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని లోకేశ్‌కుమార్ ఆదేశించారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపారు.
16 మంది అదనపు, డిప్యూటీ కలెక్టర్ల బదిలీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



