– ఢిల్లీ హైకోర్టు సిజికి కేజ్రీవాల్ లేఖ
న్యూఢిల్లీ : ఎక్సైజ్ పాలసీ కేసును నిష్పాక్షిక ధర్మాసనానికి బదిలీ చేయాలని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అరవింద్ కేజ్రీవాల్, ఈ కేసులోని మరికొంత మంది నిందితులు లేఖ రాసారు. ఈ విషయాన్ని ఆప్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ధర్మాసనం నుంచి ఈ కేసు బదిలీ చేయాలని కేజ్రీవాల్, మనీష్ సిసోడియా తదితర నేతలు ఈ లేఖలో కోరినట్లు తెలిపింది. జస్టిస్ శర్మ పక్షపాతంతో వ్యవరిస్తున్నారని ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయకు రాసిన లేఖలో ఆప్ నాయకులు విమర్శించారు. ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌తో సహా 22 మందిని సిబిఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును సిబిఐ ఆశ్రయించింది. ఈ నెల 9న పిటిషన్ విచారణను ప్రారంభించిన ఢిల్లీ హైకోర్టు దీనిపై కేజ్రీవాల్, ఇతరుల స్పందననను కోరింది. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. దీంతో ఈ కేసు విచారణ చేసిన సిబిఐ అధికారులపై దిగువ కోర్టు చేసిన పరిశీలనను కూడా జస్టిస్ శర్మ పక్కన పెట్టారు.
‘నిష్పాక్షిక’ ధర్మాసనానికి ఎక్సైజ్ పాలసీ కేసును బదిలీ చేయండి
- Advertisement -
- Advertisement -



