ఫిర్యాదుల వెల్లువతో ఆలేరు సి.ఐ.కొండల్ రావు బదిలీ….పోస్టింగ్ కూడా ఇవ్వలేదు!
నవతెలంగాణ – ఆలేరు
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒకేసారి 24 మంది ఇన్స్పెక్టర్లకు, నలుగురు సబ్ ఇన్స్పెక్టర్లకు పోస్టింగులు ఇస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ జి సుధీర్ బాబు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని ఆయన ఆదేశించారు. ఇందులో భాగంగా ఆలేరు ఎస్ హెచ్ ఓ గా డి యాల్లాద్రి కి పోస్టింగ్ ఇచ్చారు.ఇప్పటివరకు ఇక్కడ సీఐ గా విధులు నిర్వహిస్తున్న కొండలరావుకు ఎక్కడ పోస్టింగ్ ఇవ్వలేదు.
ఆలేరు సిఐ కొండల్ రావు పై ఫిర్యాదుల పర్వం
ఇప్పటివరకు ఆలేరు పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ గా విధులు నిర్వహిస్తున్న సీఐ కొండల్ రావు తరచూ సివిల్ తగాదాలలో తల దురుస్తూ జోక్యం చేసుకొని అమాయకులైనా వారిపై అక్రమ కేసులు బనయిస్తూ ప్రజలను వేధింపులకు గురి చేస్తున్నారని పలువురు ఆరోపిస్తూ అతని పై పదుల సంఖ్యలో ఫిర్యాదులు రాచకొండ పోలీస్ కమీషనర్ జి. సుధీర్ బాబుకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం !!
ఫిర్యాదుల్లో కొన్ని..
ఆలేరు మండలం కొలనుపాక ఆవాస గ్రామం బైరాన్ నగర్ కు చెందిన బుష లక్ష్మి ఆమె కూతురు సంధ్య పై ఈనెల 17న వారి ప్రత్యర్ధులు వారి పై గొడ్డలితో దాడి చేయాగ తీవ్ర గాయాలైన ఆమె, ఆమె కూతురు అదే రోజు ఏకంగా అంబులెన్స్ లో హైదరాబాదులోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ కి వెళ్లి సీఐ పై ఫిర్యాదు చేసింది.అనంతరం ఈనెల 19న బుష లక్ష్మి నాపై జరిగిన దాడిలో తెరవెనుక సీఐ కొండల్ రావు హస్తం ఉందని అతనిపై వెంటనే చర్య తీసుకోని నాకు న్యాయం చేయాలని బుష లక్ష్మి రాచకొండ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది.
– ఆలేరు మండలం బహదూర్ పేట గ్రామంలోని ఎస్టీ (ఎరుకల) కుటుంబాలు వారి ఇళ్లకు వెళ్లే బాటను అక్రమంగా ముళ్ళ కంచవేసి మాకు దారి లేకుండా అడ్డుకున్నారని బాధితులు ఆలేరు సిఐ కొండలరావుకు ఫిర్యాదు చేసినప్పటికీ ఏలాంటి చర్య తీసుకుపోగా బాట ఆక్రమించిన వారికే సపోర్ట్ చేయడంతో బాధితుడు రాయపురం భాస్కర్ ఈనెల 1న సిఐ కొండల్ రావు పై హైదరాబాదులోని మానవ హక్కుల కమిషన్ కు పిర్యాదు చేశాడు.
– అదేవిధంగా బహుదూర్ పేట గ్రామం లోని ఎస్టి (ఎరుకల) కుటుంబాల ఇళ్లకు వెళ్లకుండా దారినీ కొందరు అడ్డుకున్నారని అట్టి వారిపై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద చర్య తీసుకోవాలని ఆలేరు తహసిల్దార్ ఆంజనేయులు ఈనెల 4న ఆలేరు సిఐ కొండలరావుకు లేఖ నెంబర్ బి/461/2025 ద్వారా. ఆదేశాలు జారీ చేసిన అట్టి వారిపై ఏలాంటి చర్య తీసుకోలేదు.
– ఆలేరు మండలం మంతపురి గ్రామంలో ఏప్రిల్ 4వ తేదీన నాపై దాడి చేసిన వారిపై చర్య తీసుకోవాలని కోరుతూ పల్లె సంతోష్ గౌడ్ అనే వ్యక్తి సిఐ కొండల్ రావు కు ఫిర్యాదు చేశాడు. అట్టి ఫిర్యాదు పై ఏలాంటి చర్య తీసుకాకపోవడం తో సీఐపై సంతోష్ గౌడ్ మానవ హక్కుల కమిషన్ లో. రాచకొండ సిపి కీ పిర్యాదు చేశాడు.
– ఆలేరు మండలం మంతపురి గ్రామంలో గత 30 సంవత్సరాలుగా తమ ఆధీనం లో కాస్త కబ్జా కలిగి ఉన్న భూమిలో సిఐ కొండలరావు అవతలి వ్యక్తుల తో కుమ్మకై మమ్మల్ని కబ్జానుండి వెళ్లిపోవాలని బెదిరింపులకు గురి చేస్తూ మాపై అక్రమ కేసులు బనాయిస్తున్నాడని బాధితుడు చెక్క సూర్యం రాచకొండ సీపీ పిర్యాదు చేశాడు
ఆలేరు పట్టణంలోని ఒక భూమి వివాదంలో ఆలేరు సీఐ కొండలరావు జోక్యం చేసుకొని తమను బెదిరింపులకు గురిచేస్తున్నాడని అతనిపై డిజిపి, రాచకొండ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఆలేరు సిఐ కొండలరావు ట్రాన్స్ఫర్ అయ్యాడని తెలియడంతో అతని బాధితులు కొందరు మిఠాయి లు పంపిణీ చేశారు.