Saturday, May 10, 2025
Homeఖమ్మంపారదర్శకంగా రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక

పారదర్శకంగా రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక

- Advertisement -

ప్రత్యేక అధికారి డాక్టర్ ప్రదీప్ కుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట
: రాజీవ్ యువ వికాసం పథకంలో లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని, అందుకు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మండల ప్రత్యేక అధికారి, పశుసంవర్ధక శాఖ అదనపు సంచాలకులు డాక్టర్ ప్రదీప్ కుమార్ సూచించారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో రాజీవ్ యువ వికాసం పై ఎంపిడిఓ ప్రవీణ్ కుమార్ ఆద్వర్యంలో బ్యాంక్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పథకం దరఖాస్తుదారులు ఎంపికకు కావలసి వివరాలను అందించాలని, ముఖ్యంగా సివిల్ స్కోర్ వివరాలను పరిశీలించి ఇవ్వాలన్నారు. ఐదు సంవత్సరాలలోపు ఎటువంటి ప్రభుత్వ పథకాలను పొందని వారిని గుర్తించాలని అధికారులు తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఆశ్వారావుపేట మున్సిపల్ కమీషనర్ సుజాతతో పాటు పలు బ్యాంక్ మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -