అధికారులకు క్రీడాశాఖ మంత్రి ఆదేశాలు
హైదరాబాద్ : స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలను అత్యంత పారదర్శకంగా చేపట్టాలని, ఎటువంటి సిఫారసులను పరిగణనలోకి తీసుకోవద్దని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలకు మంగళవారం నుంచి హకీంపేటలో రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నారు. శాట్జ్ చైర్మెన్ శివసేనా రెడ్డితో కలిసి మంత్రి ప్రవేశ ప్రక్రియ పోటీలను పర్యవేక్షించారు. స్పోర్ట్స్ స్కూల్‌లో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతిభావంతులకు ప్రవేశాలు కల్పిస్తేనే.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించగల అథ్లెట్లను తీర్చిదిద్దవచ్చని అధికారులకు వాకిటి శ్రీహరి గుర్తుచేశారు.
పారదర్శకంగా స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలు
- Advertisement -
- Advertisement -