Thursday, October 23, 2025
E-PAPER
Homeఖమ్మంరవాణా చెక్ పోస్ట్ మూసివేత

రవాణా చెక్ పోస్ట్ మూసివేత

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
సరిహద్దు రవాణా చెక్ పోస్ట్ ను అధికారులు బుధవారం మూసివేశారు. సరిహద్దు చెక్ పోస్ట్ లను  మూసివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటంతో అదికారులు చెక్ పోస్టు ఖాళీ చేశారు.భారీ కేడ్ లను, నేమ్ బోర్డ్ లను తొలగించారు. 2014 లో ఏర్పాటు చేసిన ఈ చెక్ పోస్ట్ నుండి ప్రభుత్వానికి ప్రతి ఏటా సుమారు రూ.8 కోట్ల వరకు ఆదాయం లభించేది.చెక్ పోస్ట్ లో ప్రయివేట్ వ్యక్తుల ద్వారా అధికారులు అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్నట్లు పిర్యాదులు రావటంతో ఏసీబీ అధికారులు కొద్ది రోజుల క్రితం దాడులు నిర్వహించారు. ఆంద్రప్రదేశ్ సరిహద్దు చెక్ పోస్ట్  ను ఏపీ ప్రభుత్వం 2023 లోనే ఎత్తివేసింది. ప్రభుత్వ రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వులతో చెక్ పోస్ట్ ను మూసి వేసినట్లు ఎంవీఐ జనార్ధన్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు రవాణా శాఖ ద్వారా అందించిన సేవలను ఇకపై ఆన్ లైన్ లో పొందాలని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -