- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రవాణాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని చెక్‌పోస్టులు ఎత్తివేయాలని రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం 5 గంటల తర్వాత ఎక్కడా చెక్‌పోస్టులు ఉండొద్దని ఆదేశాల్లో పేర్కొన్నారు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన రవాణాశాఖ చెక్‌పోస్టుల్లో అవినీతి పెరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రవాణాశాఖ చెక్‌పోస్టులను రద్దు చేస్తూ జులై ఆఖరి వారంలోనే రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. నెలరోజులు ఆలస్యంగా జీఓ జారీ అయ్యింది. తాజాగా ఆదేశాలు జారీ చేశారు.
- Advertisement -